Posts

Showing posts from June, 2025

స్వేచ్ఛను మళ్ళీ చంపేశారు!

  Danny Notes స్వేచ్ఛను మళ్ళీ చంపేశారు ! కల్పనా రెంటాల on June 28, 2025 ప్రముఖ జర్నలిస్ట్ , కవయిత్రి , యాక్టివిస్ట్ స్వేచ్ఛ ఒక బలహీనమైన క్షణంలో ఆత్మహత్యకు పాల్పడింది . 24 గంటలుగా మీడియా ఆ అమ్మాయి ఆత్మహత్య పై హోరెత్తి పోతోంది . స్వేచ్ఛతో పరిచయమున్న వారికి , లేనివారికి అందరినీ ఈ ఆత్మహత్య నిస్సందేహంగా దిగ్భ్రాంతికి గురి చేసింది . అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకోవటంలో తప్పు లేదు . కానీ దానికి చెల్లించే మూల్యం ఎంత ? ఎవరి జీవితాలను పణంగా పెట్టి మనం ఆ విషయాలు తెలుసుకుంటున్నాము అన్న విషయంలో ప్రతి ఒక్కరూ మరోసారి ఆలోచించుకోవటం మంచిది . స్వేచ్ఛ గురించి ఇప్పటిదాకా బయట తెలిసింది ఆమె వ్యక్తిత్వం , వెలుగులు జిమ్మే ఆమె నవ్వు , వెన్నెల పూసే ఆమె ధైర్యం , తెగువ , లోతైన ఆలోచన , ఆమె లోని సున్నితత్వం , చలాకీతనం , న్యాయం కోసం ఆమె నిలబడ్డ తీరు ... ఇవి మనకు తెలిసిన స్వేచ్ఛ . ఆమె ఆత్మహత్య వార్త సోషల్ మీడియాలో బయటకు రాగానే మనం తెలుసుకున్న స్వేచ్ఛ వేరు . ఆమె వ్యక్తిగత జీవితాన్ని బజారుకు లాగిన మీడియా జర్నలిస్టులు , ...