Posts

Showing posts from July, 2025

రెవెన్యూ బరితెగింపు!Penuganchiprolu MRO Office

Image
  రెవెన్యూ బరితెగింపు! ABN  , Publish Date - Jul 30 , 2025 | 01:33 AM గ్రామాల్లో పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగాల సృష్టి జరపాలని ఒకవైపు ప్రభుత్వం కృషి చేస్తుంటే మరోవైపు అవినీతి రుచి మరిగిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఉద్దేశానికి మకిలి పట్టిస్తున్నారు. బరి తెగించి మరీ లంచాలు డిమాండ్‌ చేస్తున్నారు. పారామౌంట్‌ కంపెనీ పెనుగంచిప్రోలు మండలంలో భూములు కొనుగోలు చేసి పరిశ్రమ విస్తరణలో భాగంగా ల్యాండ్‌ కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే పైసలిస్తేనే ఫైల్‌ ముందుకు కదులుతుందని బీష్మించుకుర్చున్నారు. స్థానిక ఎమ్మెల్యే మందలించినా తీరు మార్చుకోకపోవడంతో విసిగిపోయిన కంపెనీ యాజమాన్యం విస్తరణ పనులను వాయిదా వేసుకుంది. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Penuganchiprolu Tahasiladar A. Santhilakshmi  - పారామౌంట్‌ కంపెనీకి చుక్కలు చూపిస్తున్న తహసీల్దార్‌ కార్యాలయం Advertisement: 0:26 Close Player - పెనుగంచిప్రోలులో పరిశ్రమ విస్తరణకు 8 ఎకరాలు కొనుగోలు - ల్యాండ్‌ కన్వర్షన్‌ కోసం దరఖాస్తు.. రూ.లక్షల్లో లంచం డిమాండ్‌ - జగ్గయ్యపేట ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన యాజమ...

స్మార్ట్‌ మీటర్: మాట మార్చిన చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం

 స్మార్ట్‌ మీటర్: మాట మార్చిన చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం By Telugu staff on July 1, 2025 స్మార్ట్ మీటర్ల దోపిడి విధానంపై ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం మాట మార్చి బాగున్న డిజిటల్‌ మీటర్లను తొలగించి, ప్రజల కళ్ళుగప్పి స్మార్ట్‌ మీటర్లను బిగిస్తున్నారు. ముందు ప్రభుత్వ కార్యాలయాలకు, ఆ తదుపరి షాపులు, పరిశ్రమలు, సంస్థలకు బిగించారు. ఇప్పుడు నివాస గృహాలకు పెడుతున్నారు. వినియోగదారుల ముందస్తు అనుమతి లేకుండా, మోసపూరిత మాటలతో, బెదిరింపులతో మీటర్లను పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారుల గుండెలలో రైళ్లను పరిగెత్తిస్తున్న ఈ పరిణామాలకు కారకులు ఎవరు? బడా కార్పొరేట్ ఆదానీ కంపెనీకి స్మార్ట్ మీటర్లకు పదేళ్ల పాటు నిర్వహణ డీబీఎఫ్‌ఒఒటీ(డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఓన్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో కాంట్రాక్టును చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. తొలి దశలో 41 లక్షల కనెక్షన్లకు మీటర్లు పెడుతున్నారు. దశలవారీగా రాష్ట్రంలోని...