ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్
Operaion Sindoor: ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్
ABN , Publish Date - May 09 , 2025 | 11:07 AM
Operaion Sindoor: దేశానికి డబ్బులు కావాలంటూ పాక్ ప్రజలు ప్రపంచ బ్యాంక్‌కు విజ్ఞప్తులు చేస్తూ ట్యాగ్‌లు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలను అడుక్కుంటున్న పరిస్థితి ఏర్పడింది. వద్దని ఎంత వారించినా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. భారత్ సైన్యం దాడులతో పాకిస్తాన్ ఖంగు తింటోంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలే ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి పాకిస్తాన్‌లో కనిపిస్తోంది.

Operaion Sindoor: ఎంత వారించినా.. వద్దన్నా.. కయ్యానికి కాలు దువ్వినటువంటి పాకిస్తాన్ (Pakistan)కు చుక్కలు కనబడుతున్నాయి. భారత్ (India) దాడులకు పాక్ కకావికలమవుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. భారత్ దాడులతో పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని సహా కీలక నేతలు అజ్ఞాతంలోకి (Anonymous) వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రజలను సయితం విరాళా అడుక్కునే పరిస్థితికి పాకిస్తాన్ దిగజారింది. అప్పుల కోసం అంతర్జాతీయ సంస్థలను అర్థిస్తోంది. బారత్ మెరుపుదాడులతో పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో భయం నెలకొంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు మద్దతు కరువైంది. ఇటు ప్రపంచ బ్యాంకుకు ట్యాగ్ చేయాలంటూ పాక్ పౌరులకు ప్రభుత్వం విజ్ఞప్తులు చేసే పరిస్థితి నెలకొంది.
Comments
Post a Comment