The War Against Working Class
ఇది ఉపఖండంలోని కమ్యూనిస్టు పార్టీల వైఫల్యం..!
దురదృష్టవశాత్తు భారత్ - పాక్ లోని రెండు దేశాల కమ్యూనిస్టు పార్టీలు తమ దేశ పాలకవర్గాలకు పూర్తిగా లొంగిపోయాయి. కాశ్మీర్ సమస్యపై, సీమాంతర ఉద్రవాదంపై ఈ రెండు దేశాల కమ్యూనిస్టు పార్టీల వైఖరి పాలకవర్గాల వైఖరితో సరి సమానంగా వుంది. ప్రపంచ కార్మిక వర్గాల ఐక్యత అనే సూత్రాన్ని గాలికి వదిలేసి పాలకవర్గాల ఆటలో పావులుగా మారుతున్నారు.
దాదాపుగా 80 కోట్ల మంది దక్షిణాసియా ప్రజలు కనీస తిండికి కూడా నోచుకోకుండా ఆకలితో అలమటిస్తుంటే ఈ రెండు దేశాల పాలకవర్గాలు తమ తమ దేశ ప్రజలను పీడిస్తూ,అణచివేస్తూనే మరోవైపు పొరుగువారిని ద్వేషించాలని కృత్రిమ దేశ భక్తిని నూరిపోస్తూ అణ్వాయుధాలతో ప్రమాదకరమైన ఆటలు ఆడుతున్నారు.
తమ తమ దేశాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అసమానత్వం పెరిగిపోతూ ప్రజలు ఉద్యమలవైపు ఆకర్షితులవుతుంటే (ఈ నెల 20న భారత్ లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు - భారత్ పాక్ టెర్రరిస్టు స్థావరాలపై దాడి చేయడానికి రెండు రోజుల ముందు హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాకిస్తాన్ లో వేలాది మంది ప్రజలు రోడ్లు ఎక్కి నిరసన చేశారు) కార్మిక వర్గంలో ఉన్న ఈ కోపాన్ని విదేశీ శత్రువు వైపు మళ్లించడానికి రెండు దేశాల పాలకవర్గాలు ఈ యుద్ధాన్ని ఉపయోగించుకొంటున్నారు.
భారత బూర్జువా వర్గానికి సేవ చేయడంలో, మధ్య భారతంలోని దేశ సంపదను వారికి దోచి పెట్టడంతో పాటు తన పాలన నిరాటంకంగా కొనసాగించడానికి ఉగ్రవాదంపై పోరు అంటూ మోషా (మోడీ, అమిత్ షా)లు కొత్త నాటకానికి తెర దీస్తే దీనికి ఈ దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు ప్రశ్నించకుండా, నిలదీయకుండా పాలక వర్గానికి పూర్తి అండదండలు అందించి జేజేలు పలుకుతున్నారు. ఇది కాదు కదా చేయాల్సింది. ఇది ప్రపంచ కార్మిక వర్గ ఐక్యతకు విఘాతమే

Comments
Post a Comment