10 Medical Colleges PPP - High Court

 AP High Court: పీపీపీ ఆపలేం

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:08 AM


రాష్ట్రంలోని 10 మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులపై పీపీపీ విధానంలో థర్డ్‌ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.


AP High Court: పీపీపీ ఆపలేం


అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం



చట్టవిరుద్ధమైతే తప్ప జోక్యం చేసుకోలేం


టెండర్‌ పక్రియ ఆగేలా ఉత్తర్వులివ్వలేం


మెడికల్‌ కాలేజీలపై తేల్చిచెప్పిన హైకోర్టు


కౌంటర్‌ దాఖలుకు సర్కారుకు సమయం


థర్డ్‌ పార్టీకి హక్కులివ్వకుండా చూడాలన్న


పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనం


Advertisement


అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 10 మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులపై పీపీపీ విధానంలో థర్డ్‌ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని తేల్చిచెప్పింది. పబ్లిక్‌, ప్రైవేట్‌, పార్ట్‌నర్‌షిప్‌(పీపీపీ)తో మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమైతే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొంది. కాలేజీలు, ఆసుపత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది?. దీని వల్ల లాభనష్టాలు ఏంటి?. అన్ని అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ‘‘పీపీపీ ప్రక్రియ ప్రస్తుతం టెండర్ల దశలోనే ఉంది. ప్రభుత్వం ఆహ్వానించిన వెంటనే డబ్బుల సంచులతో పెట్టబడిదారులు హడావుడిగా రారుకదా!’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన తరువాత అన్ని అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. కౌంటర్‌ వేసేందుకు సమయం ఇస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.


ABN ఛానల్ ఫాలో అవ్వండి


స్టే ఇవ్వండి!


రాష్ట్రంలోని ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం మెడికల్‌ కాలేజీలను పీపీపీతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదిస్తూ గత నెల 9న ప్రభుత్వం జీవో 590ని జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ గుంటూరుజిల్లా, తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్‌ కుర్రా వసుంధర హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌. శ్రీరామ్‌, న్యాయవాది అశోక్‌రామ్‌ వాదనలు వినిపించారు. ‘‘లాభ, నష్టాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండానే పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. నిర్వహణ బాధ్యతను 33ఏళ్ల పాటు థర్డ్‌ పార్టీకి అప్పగించడం ద్వారా ప్రైవేటు వ్యక్తులు రూ.వేల కోట్లు ఆర్జిస్తారు. ఇప్పటికే పిలిచిన టెండర్లను ఖరారు చేయకుండా కోర్టు స్టే ఇవ్వాలి’’ అని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆసుపత్రుల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని, కాలేజీల నిర్మాణం ఏదశలో ఉందని ఆరా తీసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) వాదనలు వినిపిస్తూ.. ‘‘మొత్తం 17 మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణానికి రూ.8,500 కోట్లు అవసరం. పులివెందుల మెడికల్‌ కాలేజీ నిర్మాణం 80 శాతం పూర్తయింది. మిగిలిన కాలేజీల నిర్మాణాలు 20-30శాతం మాత్రమే జరిగాయి. పీపీపీ విధానంలో అభివృద్ధి వ్యవహారం టెండర్ల దశలో ఉంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తాం. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దు’’ అని ధర్మాసనాన్ని కోరారు.





పిపిపి అంటే ప్రజలకు కీడు.. కార్పొరేట్లకు మేలు

Oct 22,2025 20:47


FacebookEmailWhatsAppXTelegram

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి బలరాం

ఏలూరు ప్రభుత్వాస్పత్రి వద్ద సంతకాల సేకరణ

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలను పిపిపి పద్దతిలో అభివృద్ధి చేయడం అంటే కార్పొరేట్లకు మేలు, ప్రజలకు కీడు చేయడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి బలరాం అన్నారు. మెడికల్‌ కాలేజీలను పిపిపి విధానం పేరుతో ప్రయివేటీకరించడాన్ని నిరసిస్తూ సిపిఎం, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం, తణుకులో ప్రభుత్వాస్పత్రులు, పలు కూడళ్ల్ల వద్ద ప్రజల నుండి సంతకాలు సేకరించి ధర్నా నిర్వహించారు. ఏలూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రావి గోపాలకృష్ణయ్య తొలి సంతకం చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ప్రభుత్వ పెట్టుబడితో నిర్మించిన మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వమే నిర్వహించాల కోరారు. పిపిపి విధానం కారణంగా రిజర్వేషన్‌ అర్హత కలిగిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఇబిసి విద్యార్థులు నష్టపోతారన్నారు. విద్యవైద్య రంగాలను ప్రభుత్వమే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ రవి, డాక్టర్‌ రావి గోపాలకృష్ణయ్య మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిఎన్‌విడి ప్రసాద్‌, పిల్లి రామకృష్ణ, నగర కార్యదర్శి పంపన రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


మెడికల్‌ కళాశాలల ప్రయివేటీకరణ విరమించుకోవాలి


పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రకాశం చౌక్‌ సెంటర్‌లో నిర్వహించిన సంతకాల సేకరణలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి గోపాలన్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గాతల జేమ్స్‌ మాట్లాడుతూ ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీని నెరవేర్చాల కోరారు. ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గంట సుందర్‌ కుమార్‌, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కె క్రాంతిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి ప్రసాద్‌ మాట్లాడారు. తణుకులో సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రతాప్‌ మాట్లాడారు. ఇరగవరం మండల కేంద్రంలో సంతకాల సేకరణలో గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామన మునిస్వామి మాట్లాడారు.


Comments

Popular posts from this blog

Chenchulu of Nallamala

Gujarati financial influence on the Indian economy

Row over CPI(M) not calling Modi govt ‘fascist’; Vijayan eyeing ‘BJP vote’: Cong