దళితులు పట్టణాలకు తరలాలి - –డా.పసునూరి రవీందర్
మార్జినల్ వాయిస్ - 10 ఇవాళ్టి తెలుగుప్రభ దినపత్రికలో నా వీక్లీ కాలమ్. //దళితులు పట్టణాలకు తరలాలి// ‘‘యువత గ్రామాలకు తరలండి’’ అనే పిలుపుకు తెలుగునాట చాలా చరిత్ర ఉంది. ఆ పిలుపుకు ఆకర్షితులయ్యి యువత పెద్దమొత్తంలో అడవిబాట పట్టారు. ఆ క్రమంలోనే అకాల మరణాల పాలై, తమను నమ్ముకున్న కుటుంబాలకు తీరని అన్యాయం చేశారు. మరోవైపు తాము అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో 90వ దశకం తరువాత తెలుగునాట దళిత చైనత్యం ఎంతో పెరిగింది. చదువుకున్న యువత కారంచేడు,చుండూరు ఘటనల నేపథ్యంలో కులవ్యవస్థను గురించి తీవ్రంగా ఆలోచించింది. మన విముక్తి చదువుతో మాత్రమే సాధ్యమవుతుందని అందుకు అంబేద్కర్నే స్ఫూర్తిగా తీసుకున్నారు. అప్పటికీ విప్లవోద్యమంలో పని చేసిన దళితులకు అంబేద్కర్ కంటే మార్క్స్, మావోలే ఎక్కువ చేరువయ్యారు. అందుకు కారణం ఆ పార్టీల్లోని ఆధిపత్యకులాలకు చెందిన నాయకులే. వారే దళితులకు అంబేద్కర్ను అందకుండా చేసి, ఆయనను ఒక బూర్జువాగా ప్రచారం చేశారు. కేవలం బ్రిటీష్ పాలకులకు మెమోరాండాలు ఇచ్చిన నేతగా మాత్రమే చూశారు. అట్లా సదరు ఓసీ నాయకులు అంబేద్కర్ రచనలను గాని, ఆయన ఆలోచనలను గాని తెలుసుకోలేకపోయారు. ఇది దశాబ...